100 మిలియన్ వ్యూస్ తో కాజల్ “సత్యభామ”

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ చిత్రం జూన్ 7, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని అలరించింది. ఈ చిత్రం ఇటీవల ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో ట్రెండ్ లో కొనసాగుతోంది.

సత్యభామ చిత్రానికి దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఇందులో కథానాయకుడిగా నటించడం జరిగింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసుగా నటించి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

Exit mobile version