ఓటీటీలో ‘జీబ్రా’కు సెన్సేషనల్ రెస్పాన్స్

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటించే సినిమాలు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు ఏదో ఒక ఇన్‌డెప్త్ మెసేజ్ కూడా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక సత్యదేవ్ నటించిన రీసెంట్ మూవీ ‘జీబ్రా’ మంచి బజ్‌తో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా రావడంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

నవంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన ‘జీబ్రా’ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కి కూడా వచ్చేసింది. ఈ సినిమాకు ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన జీబ్రా చిత్రానికి ఆహాలో ఏకంగా 100 మిలియన్‌కి పైగా నిమిషాల వ్యూయర్‌షిప్ దక్కినట్లు ఆమా వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘జీబ్రా’ చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేయగా ఇందులో ప్రియా భవానీ శంకర్, డాలి ధనుంజయ, అమృత అయ్యంగర్, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version