దీపావళి బరిలో నుంచి తప్పుకున్న ‘జీబ్రా’

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా ‘జీబ్రా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. పూర్తి థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. దీంతో దీపావళి బరిలో ఈ సినిమా కూడా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కొంతమేర ఆసక్తిని చూపారు.

కానీ, ఇప్పుడు దీపావళి రేస్ నుండి ‘జీబ్రా’ మూవీ తప్పుకుంది. ఈమేరకు మేకర్స్ ఓ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల తమ సినిమాను దీపావళి కానుకగా అందించలేకపోతున్నామని.. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. అయితే, ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేని కారణంగానే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని వాయిదా వేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో సత్యదేవ్‌తో పాటు ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినెటో, డాలి ధనంజయ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది వేచి చూడాలి.

Exit mobile version