విష్ణు మంచు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా అక్టోబర్ 21, 2022 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ మూవీలో పాయల్ రాజ్‌పుత్ మరియు సన్నీ లియోన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ రోజు, ఈ చిత్రంలో పండు పాత్రలో నటిస్తున్న సత్యం రాజేష్ యొక్క సరికొత్త క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని AVA ఎంటర్టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మించడం జరిగింది. నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.