‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్!

‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్!

Published on Sep 14, 2024 3:55 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తుండగా ఇందులో విశ్వక్ సేన్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.

తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌కి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా రెండో పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 15న చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌తో వారు ఈ విషయాన్ని రివీల్ చేశారు.

ఇక ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ‘సరిపోదా శనివారం’ మూవీకి జేక్స్ అందించిన మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు