ఎమోషన్‌తో మ్యాజిక్ చేయనున్న ‘డాకు మహారాజ్’

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ మూవీపై అంచనాలను క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌గా చిన్ని అనే మెలోడీ పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ పాటను డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ పాట ఆద్యంతం ఎమోషన్‌తో సాగనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటలో ఉండే ఎమోషన్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ పాటలో చిన్నారి పాపతో బాలయ్య పండించే ఎమోషన్స్ అభిమానులకు ఫీస్ట్‌లా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version