అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తుండగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, బుజ్జి తల్లి సాంగ్‌కు సాలిడ్ రెస్పాన్స్ లభించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘నమో నమ: శివాయ’ అంటూ సాగే ఈ శివశక్తి సాంగ్‌ను గతంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ సాంగ్‌ను జనవరి 4న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.