న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తు్న్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్.
ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు నాని అండ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ సాంగ్‌కు ‘అబ్ కీ బార్ అర్జున్ సర్కార్’ అనే స్లోగన్ వాడుతున్నట్లు తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమాలోని ఈ రెండో సాంగ్‌ను ఏప్రిల్ 9న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కోమలి ప్రసాద్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
AB KI BAAR
ARJUN SARKAARChala vinapadthundhi ika nunchi ..
Song out tomorrow 🙂#AbKiBaarArjunSarkaar #HIT3 pic.twitter.com/eHCOFY6LxT— Nani (@NameisNani) April 8, 2025