మాస్ మహారాజా రవితేజ హీరోగా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీని యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి వీడు అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని పలు భాషల్లో రేపు రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సాంగ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ ని చంద్రబోస్ రచించారు. పవర్ఫుల్ లిరిక్స్ తో ఆకట్టుకునే ట్యూన్ తో సాగిన ఈ ప్రోమో అందరిలో సాంగ్ పై మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరిచింది. కాగా ఈ మూవీ అక్టోబర్ 20న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.