విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శివ కార్తికేయన్ , సమంత, సిమ్రాన్ ,సూరి
దర్శకత్వం : పొణ్రమ్
నిర్మాత : సాయి కృష్ణ పెండ్యాల
సంగీతం : ఇమ్మాన్
ఎడిటర్ : వివేక్ హర్షన్
పొణ్రమ్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ , సమంత జంటగా నటించిన చిత్రం సీమరాజా. గత ఏడాది కోలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులోకి డబ్ చేసి విడుదలచేశారు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..
కథ :
రాజుల వంశానికి చెందిన సీమరాజా (శివ కార్తికేయన్) బాధ్యత లేకుండా తన ఇమేజ్ ను పెంచుకోవడం కోసం ఊర్లో వారి అందరికి దానాలు చేస్తూ ఉంటాడు. ఇక పొరుగూరు అయిన పులి వెందుల లో క్రిష్ణయ్య అక్రమాలకు పాల్పడి కోటీశ్వరుడిగా ఎదిగి ఈ రెండు ఊర్లకు మధ్య గొడవలను సృష్టిస్తాడు. ఇదే క్రమంలో శివ కార్తికేయన్ కృష్ణయ్య మొదటి భార్య కూతురైనా లక్ష్మి (సమంత) ను ప్రేమిస్తాడు. కానీ వారి పెళ్ళికి కృష్ణయ్య ఒప్పుకోడు. అంతటితో ఆగకుండాఆ ఊరి వారందరి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆ తరువాత సీమరాజా తన బాధ్యత ను తెలుసుకొని ఆ ఉరి వారందరి సమస్యలను ఎలా పరిష్కరించాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మెయిన్ ప్లస్ అంటే శివ కార్తికేయనే. తన ఎనర్జిటిక్ నటనతో సినిమా అంత వన్ మ్యాన్ షో చేశాడు. ముఖ్యంగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అలాగే రెండు డిఫరెంట్ షేడ్స్ లో చాలా ఈజీగా నటించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక విలేజ్ అమ్మాయిగా నటించిన సమంత చాలా గ్లామర్ గా కనిపించింది. శివ కార్తికేయన్ , సమంత కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
ఇక సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా కి చాలా ప్లస్ అయ్యింది. ఆ ఎపిసోడ్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు వాటి తాలూకు విఎఫ్ ఎక్స్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు అలాగే కమిడియన్ సూరి , శివ కార్తికేయన్ బాగానే నవ్విస్తారు. రైతుల సమస్యలను డైరెక్టర్ అడ్రెస్ చేసిన తీరు బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ అంటే స్క్రీన్ ప్లే నే. కాన్సెప్ట్ బాగున్నా దాన్ని తెర మీదకు తీసుకువచ్చిన విధానం బాగాలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా విసిగిస్తుంది. కథ లేకుండా ఫస్ట్ హాఫ్ నడిపిన తీరు కూడా సినిమా ఫలితం ఫై ప్రభావం చూపించింది. అయితే సెకండ్ హాఫ్ ను ఆసక్తికరంగా స్టార్ట్ చేసిన కూడా ఆ తరువాత మళ్ళీ ఫస్ట్ హాఫ్ లోలాగా విసిగిస్తుంది.
ఇక సినిమాలో విలన్ భార్య గా నటించిన సిమ్రాన్ తన నటనతో సినిమాను రక్తికట్టించేలా చేసింది కాని ఆమె పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో ఆమె పాత్రకూడా నామమాత్రం గానే అనిపిస్తుంది. వీటికి తోడు సిల్లీ సన్నివేశాలు కూడా ప్రేక్షకుడిని విసిగిస్తాయి.
ఇక సినిమాకు సాంగ్స్ కూడా మైనస్ అయ్యాయి. వెంటవెంటనే వచ్చే సాంగ్స్ కథకు అడ్డంకిగా మారాయి. లీడ్ పెయిర్ మధ్య లో వచ్చే లవ్ స్టోరీ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది.
సాంకేతిక విభాగం :
శివకార్తికేయన్ – పొణ్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ‘వివిఎస్ , రజినిమురుగన్’ సూపర్ హిట్ అయ్యాయి. అయితే మూడవ చిత్రంగా వచ్చిన ఈ సీమరాజా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. గత రెండు చిత్రాలను కామెడీ తో విజయం తీరాలకు చేర్చిన డైరెక్టర్ ఈ సినిమా ను మాత్రం డిఫ్రెంట్ గా ట్రై చేశాడు. అయితే ఫలితం కూడా అలాగే వచ్చింది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి మంచి స్క్రీన్ ప్లే తోడైతే సినిమా వేరే స్థాయిలో ఉండేదే.
ఇమ్మాన్ అందించిన సంగీతం యావరేజ్ గా వుంది అలాగే నేపథ్య సంగీతం కూడా చాలా లౌడ్ గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి చాలా బాగుండి సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా రన్ టైం క్రిప్స్ గా వుండేట్లుగా చూసుకుంటే బాగుండేది. ఇక నిర్మాణవిలువలు చాలా రిచ్ గా వున్నాయి.
తీర్పు :
యాక్షన్ డ్రామా గా వచ్చిన ఈ సీమరాజాలో శివ కార్తికేయన్ నటన , సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ , కామెడీ సన్నివేశాలు హైలైట్ అవ్వగా బోరింగ్ స్క్రీన్ ప్లే , ఆసక్తిరంగా లేని కథనం సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. చివరగా పూర్తిగా తమిళ నేటివిటీ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం మాత్రమే కష్టమే.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team