‘సీతారామం’ ఫస్ట్ వీక్ లో ఎంత రాబట్టిందంటే…. ?

Published on Aug 12, 2022 4:36 pm IST

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన లేటెస్ట్ మూవీ సీతారామం ప్రస్తుతం భారీ స్థాయి ఆదరణతో కొనసాగుతోంది. యుద్ధంతో రాసిన ప్రేమకథగా హను రాఘవపూడి తెరేక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న ఒక కీలక పాత్ర చేయగా ఇతర పాత్రల్లో సుమంత్, భూమిక, మురళి శర్మ, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్ కనిపించారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన సీతారామం గడచిన తొలివారం రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా బాగే కలెక్షన్ ని రాబట్టింది. ఇక ఈ మూవీ మొత్తంగా తొలి వారం ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని, తమకు ఇంతటి గొప్ప విజయం అందించిన ప్రేక్షకాభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :