ఈ ఏడాది క్రిష్ తర్వాత మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. గతం లో ‘ఏ ఫిలిం బై అరవింద్’, ‘త్రీ’, ‘అరవింద్ 2’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శేఖర్ సూరి హిందీ లో ‘గన్స్ ఆఫ్ బెనారస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కరణ్ నాథ్ మరియు నతలియా కౌర్ లో ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
‘గన్స్ ఆఫ్ బెనారస్’ ధనుష్ ‘పొల్లదవన్’ చిత్రానికి రీమేక్ అని సమాచారం. అదే చిత్రాన్ని తెలుగు లో ‘కుర్రాడు’ పేరుతో నిర్మింపబడింది. ఆ చిత్రం లో వరుణ్ సందేశ్ నేహ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘గన్స్ ఆఫ్ బెనారస్’ చిత్రం దాదాపు పూర్తి కాగా ఈ చిత్రం చాలా బాగాన్ని వారణాసి ముంబాయి గోవా లలో చిత్రీకరించారు. మరో దక్షిణాది నటుడు గణేష్ వెంకటరామన్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు. అభిమన్యు సింగ్ వినోద్ ఖాన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
శేఖర్ సూరి చివరి చిత్రం ‘అరవింద్ 2’ గత ఏడాది మార్చి లో విడుదల అయింది. ఆ చిత్రం లో కమల్ కామరాజు అడోనికా రోదిక్స్ శ్రీ ముఖ్య పాత్రలు పోషించారు . అయితే ఆ చిత్రం విజయం సాధించలేకపోయింది. శేఖర్ సూరి బాలీవుడ్ ఎంట్రీ తన భవిష్యతు ని మార్చుతుందేమో చూడాలి.
బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి
బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి
Published on Apr 15, 2014 1:22 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కోర్ట్ – గుడ్ కాన్సెప్ట్ తో సాగే డీసెంట్ కోర్ట్ డ్రామా !
- సమీక్ష: దిల్ రూబా – ఆకట్టుకోని లవ్ డ్రామా
- ఓటిటి సమీక్ష: “ఎమర్జెన్సీ” – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- లేటెస్ట్.. “రాబిన్ హుడ్” నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- లేటెస్ట్.. “వీరమల్లు” కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
- సమీక్ష : ఆఫీసర్ ఆన్ డ్యూటీ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ !
- డే 1 గట్టి ఓపెనింగ్స్ అందుకున్న “కోర్ట్”
- మరో బిగ్ స్టార్ తో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్?