తన “యుగానికి ఒక్కడు” హీరో “రాయన్” పై దర్శకుడు రివ్యూ..

తన “యుగానికి ఒక్కడు” హీరో “రాయన్” పై దర్శకుడు రివ్యూ..

Published on Jul 26, 2024 8:59 AM IST


కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు అయినటువంటి ధనుష్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “రాయన్”. మరి ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ తదితరులు కూడా నటించారు. అయితే ఈ సినిమా నేడు తెలుగు సహా తమిళ్ లో రిలీజ్ కి వస్తుండగా థియేటర్స్ లోకి వచ్చే ముందే ఈ సినిమా నటుడు అలాగే ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేసారు.

“రాయన్ చూసాను, మాటల్లేవు, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ధనుష్ నటుడుగాను దర్శకుడుగా కూడా షైన్ అయ్యారు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది బ్రదర్, అందరి నటీనటుల పెర్ఫామెన్స్ లు చాలా బాగున్నాయి. ఏ ఆర్ రెహమాన్ తన సంగీతంతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు. టీం అందరి విషయంలో ఎంతో ఆనందంగా ఉంది” అని తన యుగానికి ఒక్కడు 2 హీరో ధనుష్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దీనితో తన రివ్యూ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు