విషాదం : ప్రముఖ నటుడు హరనాథ్ కుమార్తె హఠాన్మరణం

విషాదం : ప్రముఖ నటుడు హరనాథ్ కుమార్తె హఠాన్మరణం

Published on Dec 20, 2022 5:50 PM IST

daug

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు హరనాథ్ మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. అప్పట్లో గుండమ్మ కథ, లేత మనసులు, చిట్టిచెల్లెలు వంటి అనేక సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన హరనాథ్, 1989లో మరణించారు. ఆ తరువాత ఆయన కుమార్తె పద్మజ ని వివాహమాడిన అల్లుడు జివిజి రాజు నిర్మాతగా టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గోకులంలో సీత, తొలిప్రేమ తోపాటు సుమంత్ నటించిన గోదావరి వంటి హిట్ సినిమాలు నిర్మించారు జివిజి రాజు. ఇక ఆయన సతీమణిగా భర్త కి చేదోడు వాదోడుగా కొనసాగుతున్న హరనాథ్ కూతురు పద్మజ ఇటీవల తండ్రి జీవితం పై అందాల నటుడు అనే పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు.

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చేతల మీదుగా ఆ పుస్తక ఆవిష్కరణ జరిగింది. అయితే విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం పద్మజ గుండెపోటు తో హఠాన్మరణం పొందారు. ఈ విషయాన్ని ఆమె భర్త జివిజి రాజు అధికారికంగా వెల్లడించారు. అతి త్వరలో తమ కుమారుడిని నిర్మాత గా లాంచ్ చేసేందుకు పద్మజ ప్రయత్నాల్లో ఉన్నారని, ఇటువంటి సమయంలో ఆమె హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం అని పలువురు సినీ ప్రముఖులు పద్మజ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా భార్య మరణం జివిజి రాజు ఒక్కసారిగా కృంగిపోయారు. పలువురు వారి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆయనకి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని అందించాలని కోరుతూ ఓదారుస్తున్నారు.

తాజా వార్తలు