ఆ బయోపిక్ కొరకు అనుష్క..?

ఆ బయోపిక్ కొరకు అనుష్క..?

Published on Mar 22, 2020 12:05 PM IST

టాలీవుడ్ లో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి బెస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. ఆమె మొదటిసారి అరుంధతి చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఇక టాలీవుడ్ లో ఆమె ఇప్పటివరకు అరడజను వరకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించారు. 2018లో విడుదలైన భాగమతి చిత్రం సైతం ఆమెకు మంచి పేరుతెచ్చి పెట్టింది.

కాగా సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు కూడా అనుష్క తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కర్ణాటక్ సింగర్ మరియు మహిళా హక్కుల పోరాట యోధురాలు అయిన బెంగుళూర్ నాగరత్తమ్మ బయోపిక్ తీయాలని దర్శకుడు సింగీతం శ్రీనివాస రావ్ ఆలోచిస్తున్నారట. ఆలాగే నాగారత్తమ్మ పాత్ర కోసం అనుష్కను తీసుకోవాలని అంకుంటున్నారట. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు