‘దేవర’ దెబ్బకు ‘కల్కి’ రికార్డు బద్దలు !

‘దేవర’ దెబ్బకు ‘కల్కి’ రికార్డు బద్దలు !

Published on Sep 22, 2024 8:00 AM IST

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమా ఫీవరే కనిపిస్తుంది. ఇప్పటికే, అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో దేవర సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అటు నార్త్ అమెరికాలోనూ ముందస్తు బుకింగ్స్ లో ‘దేవర’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కల్కి సినిమా రికార్డ్స్ ను దేవర బ్రేక్ చేస్తోందని అంచనాలు ఉన్నాయి.

నార్త్ అమెరికాలో మొదటి వారాంతంలో ‘కల్కి 2898 ఏడీ’ $11 మిలియన్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. పైగా మొదటి వారాంతంలో ఈ మార్కును సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. ఐతే, ప్రస్తుతం దేవర సినిమాకి జరుగుతున్న బుకింగ్స్ ను బట్టి.. ఫస్ట్ వీక్ పూర్తి అయ్యే లోపు దేవర సినిమా $11 మిలియన్లకు పైగా వసూలు చేయడం పక్కాగా కనిపిస్తోంది.

మొత్తానికి దేవర మూవీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అదే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కూడా సరికొత్త రికార్డులను దేవర బద్దలు కొట్టబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు