నార్త్ అమెరికాలో ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు

నార్త్ అమెరికాలో ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు

Published on Jul 1, 2024 10:23 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్లు వసూలు చేసింది. ఐతే, ఉత్తర అమెరికాలో మాత్రం, ఈ చిత్రం అసాధారణమైన మైలురాయిని సాధించింది. మొదటి వారాంతంలో ‘కల్కి 2898 ఏడీ’ $11 మిలియన్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. పైగా మొదటి వారాంతంలో ఈ మార్కును సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది.

దీనికితోడు, ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ప్రభాస్‌ వి రెండు సినిమాలు ఉండటం విశేషం. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఇంకా భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపికా పదుకొనే, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు