మరో భారీ మైల్ స్టోన్ కొట్టేసిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

మరో భారీ మైల్ స్టోన్ కొట్టేసిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

Published on Jun 14, 2024 2:00 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన రీసెంట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” (Guntur Kaaram) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి రీజినల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

మరి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా డివైడ్ టాక్ తోనే వచ్చినా మెల్లగా ఆ అన్ని పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ఇక మాస ఐటెం నెంబర్ కుర్చీ మడతపెట్టి అయితే మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అని చెప్పాలి. జస్ట్ రీసెంట్ గానే ఈ సాంగ్ 2 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి రికార్డు సెట్ చేయగా ఇప్పుడు మరో భారీ మైల్ స్టోన్ ఏకంగా 300 మిలియన్ వ్యూస్ ని దాటి దుమ్ము లేపుతుంది. మరి ఇదే స్పీడ్ లో ఇంకెక్కడ ఈ సాంగ్ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జైరాం తదితరులు నటించగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు