టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో మరో యువ నటుడు హర్ష రోహన్ కీలక పాత్రలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన సినిమానే “కోర్ట్”. పలు నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ కోర్ట్ థ్రిల్లర్ డ్రామా ప్రీమియర్స్ తోనే సాలిడ్ టాక్ ని అందుకుంది.
ఇది డే 1 కి అద్భుతంగా ప్లస్ కాగా దీనితో కోర్ట్ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేసాయి. ఇలా ఈ సినిమా మొదటిరోజు 8.10 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇది మాత్రం ఒక రకంగా సెన్సేషనల్ అనే చెప్పాలి. ఇక ఇది ప్రియదర్శి కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ కూడా అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి బేబీ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు అలాగే నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.