“కల్కి” రిలీజ్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..


పాన్ ఇండియా ఆడియెన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” ఫీవర్ ఏ రేంజ్ లో నడుస్తుందో చూస్తున్నాము. మరి సినిమా నుంచి వస్తున్నా ప్రతి అప్డేట్ కూడా ప్రభాస్ అభిమానులు సహా ఇండియా మూవీ లవర్స్ లో మరింత హైప్ పెంచుతూ వెళ్తుండగా నిన్న ఈ సినిమా తాలూకా రిలీజ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ చూసాక టోటల్ పాన్ ఇండియా ఇండస్ట్రీ ప్రముఖులు నుంచి క్రేజీ ఫీడ్ బ్యాక్ రాగా ఈ ట్రైలర్ కి ఆన్లైన్ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అయ్యింది. మొత్తం అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ కి ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చేసాయి.

ఇదంతా ఇంకా 24 గంటలు పూర్తి కాక ముందే జరిగిపోయింది. మొత్తానికి అయితే ఈ భారీ సినిమా పై అంచనాలు ఈ కొత్త ట్రైలర్ మరింత పెంచింది అని చెప్పాలి. ఇక మొత్తం సినిమాలో ఎలాంటి సర్ప్రైజ్ లు ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో దీపికా, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ తదితరులు నటించారు. అలాగే ఈ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version