“హను మాన్” ప్రీమియర్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

“హను మాన్” ప్రీమియర్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Jan 10, 2024 4:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అవైటెడ్ సూపర్ హీరో చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంపై మేకర్స్ ఒక రోజు ముందే 11న సాయంత్రం నుంచి తెలుగు స్టేట్స్ లో పైడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేయగా ఈ ప్రీమియర్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అయ్యింది.

అన్ని చోట్ల కూడా దాదాపు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక ఒక్క హైదరాబాద్ లోనే 200 కి పైగా షోస్ హౌస్ ఫుల్స్ పడిపోయాయి. దీనితో ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని సహా గెటప్ శ్రీను తదితరులు నటించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు