“కల్కి” సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

“కల్కి” సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

Published on Jun 18, 2024 12:30 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ గా ప్రభాస్ పాత్ర భైరవ ఆంథెమ్ ని రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన ఈ సాంగ్ ఫ్యాన్స్ కి నచ్చింది. అలాగే ప్రమోషనల్ గా కూడా పర్వాలేదనిపించింది.

ఇక ఈ సాంగ్ అయితే ఇప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సాంగ్ విడుదల అయ్యిన అన్ని భాషల్లో 20 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. అలాగే యూట్యూబ్ లో సాంగ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. దీనితో సాంగ్ హిట్ అయినట్టే అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితర అగ్ర తారాగణం నటించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు