“అమెరికన్ సినిమాటోగ్రాఫర్” మ్యాగజైన్ లో రావడం గౌరవం గా ఉంది – సెంథిల్ కుమార్!

“అమెరికన్ సినిమాటోగ్రాఫర్” మ్యాగజైన్ లో రావడం గౌరవం గా ఉంది – సెంథిల్ కుమార్!

Published on Oct 26, 2022 9:06 AM IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకుంది. ఒక ఇండియన్ సినిమా కి ఈ రేంజ్ లో క్రేజ్ రావడం ఈ చిత్రం తోనే సాధ్యం అయ్యింది అని చెప్పాలి.

ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ కి సంబంధించిన ఫీచర్ ను ప్రముఖ మ్యాగజైన్ అయిన అమెరికన్ సినిమాటోగ్రాఫర్ లో ప్రచురించింది. లెజెండరీ మ్యాగజైన్ లో రావడం చాలా గౌరవం గా ఉంది అని పేర్కొన్నారు. సెంథిల్ కుమార్ కి అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఈ చిత్రం జపాన్ లో కూడా రీసెంట్ గా రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఆస్కార్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు