కోలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ కి రాబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం “జైలర్”. తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ అయితే నిన్న తమిళనాడులో గ్రాండ్ గా జరుగగా ఈ ఈవెంట్ లో అయితే నెల్సన్ మరియు స్టార్ హీరోయిన్ నయనతార కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ కామెడీ డ్రామా అయినటివంటి “కోకో” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయ్యింది.
కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేసేసాడు. తాను మాట్లాడుతూ కోకో కి సీక్వెల్ ఉందని నెల్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు అని కూడా కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సీక్వెల్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాలి. మరి నిన్న ఈవెంట్ లోనే రజినీ కూడా నెల్సన్ వర్క్స్ లో అయితే “కోకో” సినిమా సహా “డాక్టర్” చిత్రాలు నాకెంతో ఇష్టం అని చెప్పడం విశేషం. మరి ఈ సూపర్ హిట్ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.


