సమీక్ష : “డంకి” – స్లోగా ఉన్నా మెప్పించే కామెడీ, ఎమోషనల్ డ్రామా

సమీక్ష : “డంకి” – స్లోగా ఉన్నా మెప్పించే కామెడీ, ఎమోషనల్ డ్రామా

Published on Dec 22, 2023 3:02 AM IST
Dunki Hindi Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ మరియు ఇతరులు

దర్శకుడు : రాజ్‌కుమార్ హిరానీ

నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ

సంగీతం: ప్రీతమ్

సినిమాటోగ్రాఫర్‌లు: సి.కె. మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్

ఎడిటర్: రాజ్‌కుమార్ హిరానీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఆల్రెడీ రెండు భారీ హిట్స్ తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫుల్ ఫామ్ లో ఉండగా తన నుంచి హ్యాట్రిక్ సినిమాగా మరో అవైటెడ్ చిత్రం “డంకి” రిలీజ్ తో వచ్చాడు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం వారి కాంబినేషన్ అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే..పంజాబ్, లుల్టు ప్రాంతానికి చెందిన మను(తాప్సి ), బుగ్గు(విక్రమ్ కొచర్) అలాగే బాలి(అనీల్ గ్రోవర్) ముగ్గురు కూడా లండన్ లో సెటిల్ అయ్యిన భారతీయులు కానీ వారు తిరిగి తమ దేశానికి వెళ్ళడానికి అర్హులు కాదు. అయితే ఒకరోజు మను, హార్డీ(షారుఖ్ ఖాన్) కి కాల్ చేసి దుబాయ్ లో కలుద్దాం అని చెప్తుంది. మరి ఈ నలుగురురికి ఉన్న పరిచయం ఎలా అయ్యింది. నిజానికి లండన్ లో సెటిల్ అవుదామని హార్డీతో ప్లాన్ చేసుకుంటారు. కానీ వారితో తాను ఎందుకు లేడు? వీరి జర్నీలో సుఖీ(విక్కీ కౌశల్) పాత్ర ఎలా ఉంటుంది? అసలు వారు అంతా ఎందుకు ఇండియా నుంచి బయటకి వెళ్ళాలి అనుంటారు? మళ్ళీ వారు తమ మాతృభూమికి తిరిగి వచ్చారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

మొదటిగా నటీనటుల కోసం చెప్పుకున్నట్టయితే మెయిన్ లీడ్ లో కనిపించిన ప్రతి నటి నటుడు కూడా మంచి పెర్ఫామెన్స్ ని అందించారని చెప్పాలి. షారుఖ్ ఖాన్ అలాగే తాప్సి పన్ను మంచి కెమిస్ట్రీ సహా తమ కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ లలో ఒకటిగా డంకి లో కూడా నటించారు. అలాగే వారిద్దరి మధ్య కనిపించే సున్నితమైన ప్రేమ కథ కూడా కదిలిస్తుంది. ఇంకా వారి మధ్య ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇక వారితో పాటుగా విక్రమ్ కోచర్, అనీల్ గ్రోవర్ లు కూడా తమ రోల్స్ లో మంచి నటన కనబరిచారు. ఇక వీరితో పాటుగా బొమన్ ఇరానీ తదితరులు కూడా మంచి నటన కనబరిచారు. ఇక వీరితో పాటుగా మరో మెయిన్ హైలైట్ విక్కీ కౌశల్ అని చెప్పాలి. తాను లిమిటెడ్ గానే కనిపించినా తన రోల్ మాత్రం చాలా ప్రభావవంతంగా అనిపిస్తుంది.

తన పాత్రని చాలా నాచురల్ గా పండించాడు. తనపై హిరానీ డిజైన్ చేసిన ఎమోషనల్ బ్లాక్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇక సినిమాలో కొన్ని హిలేరియస్ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే సెకండాఫ్ లో ఎమోషన్స్ కొన్ని ట్విస్ట్ లు క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా దర్శకుడు ఇచ్చిన చిన్నపాటి మెసేజ్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

జెనరల్ గా రాజ్ కుమార్ హిరానీ సినిమాలు కోసం తెలిసిన వారు అంటే ఒక అంచనాలు పెట్టుకొని సినిమా చూస్తారు, వారికి అయితే ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించకపోవచ్చు. మెయిన్ లైన్ లోకి వెళ్ళడానికి చాలా సమయం హిరానీ తీసుకున్నారు.

అంతకు ముందు ఉన్న నరేషన్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి కానీ ఓవరాల్ గా మాత్రం ఓ రేంజ్ లో అనిపించవు. అలాగే కథనం కూడా కొత్తగా అనిపించదు. హిరానీ 3 ఇడియట్స్ తరహాలో హీరో విషయంలో కథనం కనిపిస్తుంది.

అలాగే విక్కీ కౌశల్ పాత్రకి ఇచ్చిన ఎండింగ్ ని కూడా ఇంకాస్త బెటర్ గా నాచురల్ గా అనిపించేలా ముగించి ఉంటే బాగుండేది. అంతే కాకుండా షారుఖ్ ఖాన్ యంగ్ లుక్ లో కొన్ని చోట్ల సహజత్వం లోపించింది. ఇలా కొన్ని చోట్ల టెక్నీకల్ ఎర్రర్స్ కనిపిస్తాయి. వీటితో పాటుగా కొన్ని సీన్స్ ఊహించదగిన విధంగానే ఉంటాయి.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. టెక్నీకల్ టీం లో అయితే మ్యూజిక్ వర్క్ సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అలాగే కామెడీ రైటింగ్ బాగుంది. కొన్ని సింగిల్ లైనర్ కామెడీ డైలాగ్స్ బాగున్నాయి. అలాగే కొన్ని సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ ని బెటర్ గా చేయాల్సింది. ఎడిటింగ్ కూడా బెటర్ చేయాల్సింది.

ఇక దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ విషయానికి వస్తే.. తాను కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా డీసెంట్ ప్లాట్ ని ఎంచుకున్నారు. అలాగే దానిని బాగానే హ్యాండిల్ చేశారు కానీ తన మార్క్ ఎమోషన్స్ లోకి తీసుకెళ్లడానికి మాత్రం సమయం తీసుకున్నారు. దీనితో నరేషన్ కొంచెం డల్ గా అనిపిస్తుంది. అలాగే నరేషన్ ని కూడా రెగ్యులర్ గానే నడిపించారు. వీటితో మాత్రం మరీ తన రేంజ్ వర్క్ అనిపించదు కానీ ఓకే అనిపిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే “డంకి” చిత్రంలో షారుఖ్ ఖాన్, తాప్సి సహా విక్కీ కౌశల్ పాత్రలు వారి నటన మెప్పిస్తాయి. అలాగే కొన్ని కామెడీ సీన్స్ తో మంచి హిలేరియస్ నరేషన్, సెకండాఫ్ లో మంచి ఎమోషన్స్ బాగుంటాయి. కాకపోతే రాజ్ కుమార్ హిరానీ నుంచి తన రేంజ్ సినిమా ఆశిస్తే కొద్దిగా డీవియేట్ అవుతారు కానీ ఈ వీకెండ్ కి కొంచెం స్లోగా ఉన్నా ఎంటర్టైనింగ్ ఎమోషనల్ డ్రామాని చూడాలి అనుకునే వారిని డంకి కదిలిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు