షారుఖ్ ఖాన్ ‘జవాన్’ 9 రోజుల కలెక్షన్ డీటెయిల్స్

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ 9 రోజుల కలెక్షన్ డీటెయిల్స్

Published on Sep 16, 2023 5:13 PM IST

jawan 8
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా యువ దర్శకడు అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన లేటెస్ట్ మూవీ జవాన్. ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని మరియు అద్భుతమైన కలెక్షన్ ని సొంతం చేసుకుంటోంది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేయగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.

ఇక ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మంచి కలెక్షన్ అందుకుంటున్న జవాన్ మొత్తంగా గడచిన 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 735.02 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఇటీవల షారుఖ్ నటించిన పఠాన్ మూవీ రూ. 1000 కోట్లు పైగా కలెక్షన్ అందుకోగా జవాన్ ఫైనల్ గా ఎంతమేర రాబడుతుందో చూడాలని పలువురు షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు