ఈసారికి అభిమానుల్ని తన ఇంటి ముందుకు రావొద్దంటున్న స్టార్ హీరో

Published on Oct 27, 2020 9:57 pm IST


ఇండియన్ సినిమా హీరోల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ క్రేజ్ చాలా ప్రత్యేకమైంది. ఏళ్ళ తరబడి హిట్లు లేకపోయినా ఆయనకున్న ఫేమ్, ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు. పెద్దవాళ్ల నుండి కుర్రాళ్ల వరకు అన్ని వయసుల వారిలో అభిమానులను కలిగి ఉండటం షారుక్ ప్రత్యేకత. షారుక్ అంటే ఆయన అభిమానులకు ఎంత ప్రేమంటే ప్రతి యేడాది ఆయన పుట్టినరోజైన నవంబర్ 2న వేల సంఖ్యలో అభిమానులు ముంబైలోని షారుక్ నివాస భవనం మన్నత్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని శుభాకాంక్షలు చెబుతుంటారు. బహుమతులు, స్వీట్లు, పువ్వులు, ప్రత్యేక వంటకాలు గేట్ ముందు వదిలి వెళ్తుంటారు.

ఆ టైంలో షారుక్ బయటికొచ్చి ప్రహరీ గోడ పైభాగాన ఫెన్సింగ్ నిచ్చెన మీద తన ట్రేడ్ మార్క్ ఫోజుతో ఒక చెయ్యి పైకెత్తి నిల్చొని అందరికీ కృతఙ్ఞతలు చెబుతారు. ముంబైలో ప్రతి యేడాది ఇదొక ఆనవాయితీలా కొనసాగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అలా జరగదు. కోవిడ్ కారణంగా నిబంధనలు అమలులో ఉండటం మూలాన తన ఇంటి ముందు ఎవ్వరూ గుంపులుగా చేరవద్దని షారుక్ సోషల్ మీడియా ద్వారా విజ్ఙప్తి చేశారు. ఈసారికి దూరం నుండే శుభాకాంక్షలు చెప్పుకుందామని అన్నారు. దీనికి అభిమానులు కొద్దిగా నిరాశ చెందినా తమ మంచి కోసమే చెప్పారు కాబట్టి అలాగే.. మీరు చెప్పినట్టే చేస్తాం అంటూ అంగీకారం తెలిపారు.

సంబంధిత సమాచారం :

More