బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఓ సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నాడు. గతకొద్ది రోజులుగా తన కంటికి సంబంధించిన సమస్యతో షారుఖ్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యులు ఆయన కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు.
2014లో షారుఖ్ కంటి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ కంటి సమస్య తలెత్తడంతో ఆయన ముంబైలోని వైద్యులను సంప్రదించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేయించుకోవాలని వారు సూచించడంతో, నేడు షారుఖ్ అమెరికా వెళ్తున్నట్లు బీ-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, షారుఖ్ తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అమెరికా వెళ్లనున్నారట. మరో మూడు రోజుల్లో షారుఖ్ కు కంటి ఆపరేషన్ జరిగే అవకాశం ఉందట. షారుఖ్ సర్జరీ గురించి తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.