ఓటిటి సమీక్ష: ‘దేవా’ – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘దేవా’ – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

Published on Apr 2, 2025 7:05 PM IST

Deva Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పవిల్ గులాటి, ప్రవేష్ రానా, ఉపేంద్ర లిమాయె తదితరులు.
దర్శకత్వం : రోషన్ ఆండ్రూస్
నిర్మాణం : రాయ్ కపూర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్
సంగీతం : విశాల్ మిశ్రా, జేక్స్ బిజోయ్ (బ్యాక్గ్రౌండ్ స్కోర్)
సినిమాటోగ్రఫీ : అమిత్ రాయ్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘దేవా’ కూడా ఒకటి. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఈ చిత్రం సౌత్ ముంబైలో సెటప్ చేసిన పోలీస్ డ్రామా.. ఒక మాస్ పోలీస్ గా దేవ్ అంబ్రె (షాహిద్) కపూర్ ముంబైలో క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్ గా కనిపిస్తాడు. అయితే అదే ముంబైలో మాఫియా గ్యాంగ్స్టర్ ప్రభత్ జాదవ్ (మనీష్ వద్వాహ్) ని పట్టుకునే క్రమంలో ముంబై పోలీస్ అతన్ని విఫలం అవుతూ ఉంటారు. అయితే దేవ్ కి అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి స్నేహితులు ఏసీపీ రోహన్ (పవిల్ గులాటి) అలాగే డీసీపీ ఫర్హాన్ ఖాన్ (ప్రవేష్ రానా) కాగా వీరిలో రోహన్ తో కలిసి ప్రభత్ ని పట్టుకునే ఓ మిషన్ లో అతన్ని ఎన్కౌంటర్ చేసిన క్రెడిట్ ని దేవ్ తన ఫ్రెండ్ రోహన్ కి ఇస్తాడు. కానీ ఈ రోహన్ అనుమానాస్పదంగా ఓ పోలీస్ మీటింగ్ లోనే చంపబడతాడు. మరి అతన్ని చంపింది ఎవరు? ఈ ఇన్వెస్టిగేషన్ లో దెబ్బ తిన్న దేవ్ గతం మర్చిపోయిన తర్వాత ఏమయ్యింది? చివరికి ఆ హంతకుణ్ణి పోలీస్ పెట్టుకున్నారా లేదా? ఇందులో ఎవరెవరికి కనెక్షన్ లు ఉన్నాయి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

పోలీస్ బ్యాక్ డ్రాప్ లో అనేక వెర్షన్ లు ఉన్నాయి అయితే మంచి మాస్ కాప్ డ్రామాలని ఇష్టపడేవారికి ఈ దేవా మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇది రీమేక్ నే అయినప్పటికీ ఈ విషయం తెలియని ఆడియెన్స్ అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఈ సినిమాలో కనిపిస్తాయి. మెయిన్ గా షాహిద్ పై మాస్ మూమెంట్స్ అయితే మాస్ సినిమా లవర్స్ ని ఎంగేజ్ చేస్తాయి.

ఒక బ్యాడ్ ఆస్ కాప్ లా షాహిద్ కపూర్ తన రోల్ లో అదరగొట్టేసాడు అని చెప్పడంలో డౌట్ లేదు. తనపై ఫైట్స్ కానీ తన మస్కులర్ బాడీతో సాలిడ్ గా కనిపించాడు. అలాగే తనపై స్టైలిష్ యాక్షన్ డిజైన్ కూడా సినిమాలో బాగుంది. ఇంకా కొన్ని మాస్ డైలాగ్స్ కూడా తనపై బాగున్నాయి.

ఇక వీటితో పాటుగా మర్డర్ ఇన్వెస్టిగేషన్ పై సీన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారికి నచ్చుతాయి. వీటితో పాటుగా ఈ చిత్రంలో షాహిద్ దేవ్ అయితే సినిమాకి దేవా అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే పాయింట్ సినిమా కథనంలో రివీల్ అయినప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

అంతే కాకుండా అనిమల్ ఫేమ్ నటుడు ఉపేంద్ర లిమాయె మరో సాలిడ్ రోల్ ని అందుకున్నారు. తనపై గన్స్ పై సీన్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా షాహిద్ ఫ్రెండ్ పోలీస్ పాత్రల్లో కనిపించిన పవిల్ గులాటి అలాగే ప్రవేష్ రానాలు తమ పాత్రల్లో బాగా సెట్ అయ్యారు. అలాగే కొన్ని ఎమోషన్స్ మరియు సెకండాఫ్ లో ట్విస్ట్ లు కొన్ని బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రాన్ని ఓటిటిలో ఇదొక రీమేక్ అని తెలియని వారికి బాగానే అనిపిస్తుంది కానీ రీమేక్ అని తెలిసినవారికి అంత గొప్పగా అనిపించకపోవచ్చు. మెయిన్ గా కథనం స్లోగా సాగడం అనేది ఒకింత మైనస్ అని చెప్పాలి. షాహిద్ పై ఆ కొన్ని మాస్ మూమెంట్స్ కూడా లేకపోతే ఈ చిత్రం ఇంకా చప్పగా ఉండేది ఏమో.

అలాగే సెకండాఫ్ లో కథనం ఫస్టాఫ్ లో సాగిన రీతిలో మరీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. అలాగే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథనం కొంచెం కన్ఫ్యూజ్ గా కూడా ఆడియెన్స్ కి అనిపించి ఉండొచ్చు. అలాగే హీరో రోల్ పై డార్క్ నిజం కూడా అందరినీ మెప్పిస్తుంది అని చెప్పడానికి లేదు.

అలాగే పూజా హెగ్డే తన రోల్ లో ఓకే కానీ తాను ఆ పాత్రకి నామమాత్రం గానే అనిపిస్తుంది. ఆమెకి అంత స్కోప్ కూడా సినిమాలో పెద్దగా ఉన్నట్టు అనిపించదు. వీటితో ఈ అంశాలు సినిమాలో కొంచెం నిరాశ కలిగిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఓకే కానీ వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రం బాగోలేదు. షాహిద్ పై ఎంట్రీ సీన్ లోనే పేలవమైన గ్రాఫిక్స్ కనిపిస్తాయి. కానీ మిగతా సినిమా అంతా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక మెయిన్ గా సాంకేతిక వర్గం మ్యూజిక్ వర్క్ మాత్రం అదిరింది అని చెప్పవచ్చు. పాటలు కంటే జేక్స్ బిజోయ్ (సరిపోదా శనివారం ఫేమ్) బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది. మంచి స్టైలిష్ బీట్స్ తో మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ చూసే ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇందులో ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం ఫాస్ట్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు రోషన్ ఆండ్రూస్ విషయానికి వస్తే.. తాను మళయాళ సినిమా ముంబై పోలీస్ రీమేక్ ని బాగా హ్యాండిల్ చేసారని చెప్పవచ్చు. తన స్క్రీన్ ప్లే టీం కథనం కొంచెం స్లోగా నడిపించారు కానీ షాహిద్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ మూమెంట్స్ మంచి థ్రిల్ మూమెంట్స్ ని డిజైన్ చేసి మంచి ట్రీట్ నే అందించారు. కాకపోతే సెకండాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘దేవా’ మంచి మాస్ పోలీస్ యాక్షన్ సినిమాలు అలాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని కూడా ఇష్టపడేవారు చూడదగిన సినిమాగా నిలుస్తుంది. కథనం కొంచెం స్లోగా ఉంది కానీ సెకండాఫ్ ని కూడా ఇంకొంచెం క్లారిటీగా మైంటైన్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఫీల్ ని కలిగించి ఉండేది. వీటితో అయితే ఓటిటిలో ఈ చిత్రాన్ని ఒకసారికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు