షాకింగ్ : “బ్రహ్మాస్త్ర” నుంచి లీక్..షారుఖ్ పవర్ఫుల్ పాత్ర రివీల్.!

Published on Aug 12, 2022 8:58 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ చిత్రం “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఓ భారీ విజువల్ డ్రామాగా మాత్రమే కాకుండా ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా కూడా వస్తుంది.

మరి ఆల్రెడీ కింగ్ నాగ్, అమితాబ్, ఇంకా అనేకమంది బిగ్ స్టార్స్ ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ కూడా ఉన్నట్టుగా ఇప్పుడు కొన్ని ఫోటోలు లీకయ్యి షాకిచ్చాయి. మరి ఈ చిత్రంలో షారుఖ్ వానర అస్త్ర కి ప్రతీకగా కనిపిస్తుండగా తన లుక్స్ కూడా మంచి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే షారుఖ్ నుంచి లీకైన లుక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరిట రిలీజ్ కానుండగా మేకర్స్ ఈ సెప్టెంబర్ 9న ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :