ప్రామిసింగ్ గా షారుఖ్ “డంకి” ట్రైలర్.!

ప్రామిసింగ్ గా షారుఖ్ “డంకి” ట్రైలర్.!

Published on Dec 5, 2023 11:00 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ గా నిలవగా ఈ ఏడాదిలో తన మూడో సినిమాని అయితే షారుఖ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు. మరి ఆ చిత్రమే బాలీవుడ్ టాప్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో ప్లాన్ చేసిన అవైటెడ్ చిత్రం “డంకి”. మరి మొదటి నుంచి మంచి బజ్ ఉన్న ఈ చిత్రాన్ని మంచి ఫన్ ప్రోమోస్ పాటలతో ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు సినిమా ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు.

మరి ఈ ట్రైలర్ మాత్రం ప్రామిసింగ్ గానే ఉందని చెప్పాలి. షారుఖ్ తన గ్యాంగ్ తో కలిసి ఇండియా నుంచి లండన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మరి ఈ క్రమంలో వారు వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు వారికీ ఖచ్చితమైన ఇంగ్లీష్ రాదు అని వారిని రిజెక్ట్ చేయడం అలాగే ఎన్నో ఏళ్ల కితం భారత్ లోకి అడుగు పెట్టినపుడు తెల్లవాళ్ళని వాళ్లకి హిందీ వచ్చా మనం అడిగామా అని లాంటివి హిరానీ మార్క్ ని చూపిస్తున్నాయి.

అలాగే వారు బోర్డర్ దాటే సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు లాంటివి డీసెంట్ యాక్షన్ ని కూడా హిరానీ ప్రెజెంట్ చేశారు. అలాగే షారుఖ్ లో మూడు డిఫరెంట్ షేడ్ లుక్స్ లో కూడా కనిపించడం, వీటితో అయితే సినిమా మంచి ఎంటర్టైనింగ్ గానే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ గౌరి ఖాన్ లు నిర్మాణం వహించగా ప్రపంచ వ్యాప్తంగా మేకర్స్ ఈ డిసెంబర్ 21న సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు