రెడ్ అలెర్ట్: “సైతాన్” వెబ్ సిరీస్ చూసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం!

రెడ్ అలెర్ట్: “సైతాన్” వెబ్ సిరీస్ చూసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం!

Published on May 30, 2023 12:29 PM IST


దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న తదుపరి షో సైతాన్. ఈ షోతో మహి వి రాఘవ్ మనల్ని డీప్ గా క్రైమ్ వరల్డ్ లోకి తీసుకు వెళ్లబోతున్నారు. బలంగా ఆకట్టుకునే, వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామా ఇది.

మహి వి రాఘవ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైతాన్ షోలో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షో కథ సామజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా కుదుపుకు గురైంది అనేది ఈ చిత్రంలో చూపించారు. ఆ ఫ్యామిలీ క్రైమ్ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది కథలో కీలకంగా ఉంటుంది.

ఒక తెలుగు వెబ్ సిరీస్ లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం తొలిసారి. వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఆ సీన్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్, బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని మీరు తగిన జాగ్రత్తలతో చూడండి. సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15, 2023 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సేవ్ ది టైగర్స్ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ తర్వాత మహి వి రాఘవ్ రెండవసారి డిస్ని ప్లస్ హాట్ స్టార్ తో టీమ్ అప్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు