బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న గుణశేఖర్

Published on Jan 23, 2021 12:22 am IST

డైరెక్టర్ గుణశేఖర్ చాలా వేగంగా పనిచేస్తున్నారు. కొత్త సినిమా ‘శకుంతలం’ పనుల్ని చకచకా కానిస్తున్నారు. ఒకవైపు కాస్టింగ్ పనులు, సెట్ వర్క్, బృందానికి వర్క్ షాప్ నిర్వహిసస్తూనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. తన ఫెవరెట్ మ్యూజిక్ కంపోజర్ మణిశర్మతో ట్యూన్లు సిద్ధం చేయించుకుంటున్నారు. గుణశేఖర్ తన సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. పాటలు, నేపథ్య సంగీతం బాగుండేలా చూసుకుంటారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘చూడాలని ఉంది, మనోహరం, ఒక్కడు, అర్జున్, వరుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి.

ఈసారి అంతకంటే గొప్ప ఆల్బమ్ ఇవ్వాలని పనిచేస్తున్నారు ఇద్దరూ. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమారై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ప్రేమ కథలో విశ్వామిత్రుడు, మేనకల కుమారై, కణ్వ మహర్షి పెంపుడు కుమార్తె శకుంతల పాత్రలో స్టార్ నటి సమంత నటించనుంది. ఇక సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా పూర్తవగానే రానాతో ‘హిరణ్య కశిప’ సినిమాను మొదలుపెడతారు గుణశేఖర్.

సంబంధిత సమాచారం :