యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “భారతీయుడు 2” ఈ ఏడాదిలో వచ్చి ఎలాంటి ఫలితం అందుకుందో తెలిసిందే. మరి మొదటి చిత్రం భారతీయుడు ఎలాంటి ఐకానిక్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలుసు. దానికి సీక్వెల్ గా అందులోని శంకర్ తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై మంచి బజ్ ఏర్పడింది కానీ అనుకున్న రేంజ్ లో సినిమా అలరించలేదు.
దీనితో పార్ట్ 3 సినిమా పరిస్థితి ఏంటి అనేది మాత్రం ప్రశ్న గానే మిగిలిపోయింది. మరి ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యిపోయింది కానీ ఇపుడు ఆ సినిమా ఉందో లేదో అనేది మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై ఫైనల్ గా శంకర్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రం డెఫినెట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ సీక్వెల్ సినిమా థియేటర్స్ రిలీజ్ ని కన్ఫర్మ్ చేసుకుంది కానీ ఎపుడు వస్తుంది అనేది మాత్రం చూడాలి.