పాన్ ఇండియా సినిమా జీనియస్ దర్శకుడు శంకర్ ఇప్పుడు రెండు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో అయితే ఒకే దర్శకుడు రెండు సినిమాలకి ఇటీవల వర్క్ చేసింది లేదు. కానీ శంకర్ మాత్రం ఒక పక్క యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో “ఇండియన్ 2” (Indian 2) మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో “గేమ్ ఛేంజర్” (Game Changer) సినిమాలు చేశారు. ఇక వీటిలో ఇండియన్ 2 రిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో టీం బిజీగా ఉన్నారు.
అయితే శంకర్ సినిమాలలో సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. తన మొదటి సినిమా నుంచి కూడా ఇపుడు వరకు వచ్చిన అన్ని సినిమాల్లో సినిమా ఫలితం ఎలా ఉన్నా పాటలు కానీ విజువల్ గా కానీ అవి ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. మరి మొదటిసారి శంకర్ ఏ ఆర్ రెహమాన్ (AR Rahman), హరీష్ జైరాజ్ లని కాదని ఇండియన్ 2 కి అనిరుద్ తో వర్క్ చేశారు. అయితే ఎంత అనిరుద్ మ్యూజిక్ బాగున్నప్పటికీ అనిరుద్ శంకర్ మార్క్ ని మ్యాచ్ చేయగలడా అని చాలా మంది సందేహపడ్డారు.
కానీ ఫుల్ ఆల్బమ్ వచ్చాక మాత్రం మంచి ఆల్బమ్ నే ఇచ్చాడు అని టాక్ వచ్చింది. మరి అసలు అనిరుద్ మ్యూజిక్ పై శంకర్ ఏమన్నారో రివీల్ అయ్యింది. తాను లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ సినిమాకి తాను అనుకున్న దానికంటే బెటర్ గానే సాంగ్స్ ఇచ్చాడు అని ఒక పాట కంపోజ్ చేసాక ఎలా ఉంది అని అడిగితే నేను 80 శాతం ఓకే అంటే తాను ఖచ్చితంగా 100 శాతం ఇస్తానని చెప్పి మరీ మ్యూజిక్ అందించాడు అని అందుకు అని కి ధన్యవాదాలు తెలుపుతున్నానని శంకర్ తెలిపారు.