చరణ్ – శంకర్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్!

చరణ్ – శంకర్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్!

Published on Feb 5, 2023 1:00 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ RC15. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై అటు ప్రేక్షకుల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రేపు హైదరాబాద్ లో పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు, హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో షూటింగ్ జరగనుంది. ఇదే పాటకు సంబంధించి మిగతా పార్ట్ ను వైజాగ్ మరియు రాజమండ్రి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తన హోమ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు