బిగ్ బాస్ 5: పుట్టిన రోజు సర్ప్రైజ్ అందుకున్న షణ్ముఖ్

Published on Sep 16, 2021 1:47 pm IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో లో షణ్ముఖ్ నేడు పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ మేరకు హౌజ్ లో ఉన్న షణ్ముఖ్ కి బయటి నుండి ఒక సర్ప్రైజ్ వచ్చింది. బిగ్ బాస్ లో టైటిల్ కోసం మొదటి నుండి జాగ్రత్తగా ఆడుతున్న షణ్ముఖ్ పుట్టిన రోజు కావడం తో హౌజ్ లో ఎంటర్ టైన్మెంట్స్ కి కొదవ లేదని చెప్పాలి.

షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా యాంకర్ రవి మరియు షణ్ముఖ్, హమీద ల మధ్య జరిగిన సంభాషణలు నేడు హైలెట్ గా నిలవనున్నాయి. హమీద, షణ్ముఖ్ ల మధ్య నడిచే ఫ్రెండ్ షిప్ మరియు వారి సంభాషణలు ఆసక్తికరం గా ఉన్నాయి. అయితే షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా అతని లవర్ దీప్తి సునైన ఒక స్పెషల్ వీడియో ద్వారా ప్రపోజ్ చేసి విష్ చేయడం జరిగింది. మరొకసారి షణ్ముఖ్ కొంచెం ఎమోషనల్ కావడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసొడ్ చూడాలి అంటే నేడు రాత్రి 10 గంటలకు స్టార్ మా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :