సమీక్ష : షణ్ముఖ – రొటీన్ క్రైమ్ థ్రిల్లర్

shanmukha Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ఆది సాయి కుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, షణ్ముగం సాప్పని, మనోజ్ ఆది, కృష్ణుడు తదితరులు
దర్శకుడు : షణ్ముగం సాప్పని
నిర్మాత: తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : ఆర్.ఆర్.విష్ణు
ఎడిటర్ : ఎంఎ మలిక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఆది సాయి కుమార్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘షణ్ముఖ’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
విగాండ(చిరాగ్ జానీ)కి ఆరు తలలు ఉన్న షణ్ముఖ కొడుకుగా పుడతాడు. అతడిని మామూలుగా మార్చేందుకు క్షుద్రపూజలు చేస్తుంటాడు విగాండ. ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ సారా మహేశ్వరన్(అవికా గోర్) వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లు, అబ్బాయిల మర్డర్స్ గురించి పరిశోధన ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఈ ఘటనలకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు గుర్తిస్తుంది. ఎస్ఐ కార్తీక్ వల్లభన్(ఆది సాయి కుమార్) సాయంతో ఆమె ఈ కేసులను లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఊహించని విధంగా ఈ కేసు మలుపులు తిరుగుతుంది. అసలు ఈ కేసులతో విగాండ, షణ్ముఖలకు ఎలాంటి సంబంధం ఉంది..? ఈ అంశంలో ఎలాంటి శక్తులు విరుచుకుపడుతున్నాయి..? ఇలాంటి వాటికి సమాధానమే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది సాయి కుమార్ చక్కటి నటన కనబరిచాడు. ముఖ్యంగా ఫ్లా్ష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో అతని యాక్టింగ్ బాగుంది. అవికా గోర్ కూడా తన పాత్రలో చక్కగా ఆకట్టుకుంది. కాలేజీ సీన్స్‌లో ఆమె లుక్స్ ఆకట్టుకుంటాయి. వాళ్లిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కొంతమేర మెప్పిస్తుంది. ఓం ఆదిత్య, చిరాగ్ జానీ తమ పాత్రలతో ఆకట్టుకుంటారు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథలో మంచి విషయం ఉన్నప్పటికీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం తేడా కొట్టింది. స్క్రీన్ ప్లే వేగంగా సాగినప్పటికీ చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని ఓ డైలాగ్..‘నాకు పూర్తిగా అర్థం అయినట్లు ఉంది.. కానీ, ఏమీ అర్థం కావడం లేదు..’ ఈ సినిమా నెరేషన్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

ఈ కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా నేరుగా తీసి ఉంటే బాగుండేది. కానీ కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే‌తో ఈ కథ దారి తప్పింది. డైలాగులు ఏమాత్రం కథపై ప్రభావం చూపలేకపోయాయి. కథను మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉంటే బాగుండేది.

రవి బస్రూర్ మార్క్ బీజీఎం ఈ సినిమాలో మిస్ అయ్యింది. కొన్ని చోట్ల స్కోర్ చాలా ఎక్కువగా ఉన్నట్లు.. మరికొన్ని చోట్ల ఏమాత్రం మ్యాచ్ కానీ విధంగా ఉండటంతో ప్రేక్షకులకు బీజీఎం నచ్చదు.

సాంకేతిక వర్గం :
దర్శకుడు షణ్ముగం సాప్పని ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను తీర్చిదిద్దాలని ప్రయత్నించాడు. కానీ, కథనం విషయంలో ఆయన తడబడటంతో ఈ సినిమా ట్రాక్ తప్పింది. స్క్రీన్ ప్లే పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం కొంతమేర మారేది. ఆర్.ఆర్.విష్ణు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కానీ, రవి బస్రూర్ సంగీతం డిజప్పాయింట్ చేసింది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. ఎం.ఎ.మలిక్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది.

తీర్పు :

ఓవరాల్‌గా ‘షణ్ముఖ’ మూవీ ఓ చక్కటి ఐడియాతో స్టార్ట్ అయినప్పటికీ, స్క్రీన్ ప్లే కారణంగా ట్రాక్ తప్పింది. ఆది సాయి కుమార్ తన పాత్రతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించకపోయినా.. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ‘షణ్ముఖ’ చిత్రాన్ని ఓసారి ట్రై చేయొచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version