సమీక్ష : శాంతల – ఆకట్టుకోని కథనంతో సాగె మూవీ

సమీక్ష : శాంతల – ఆకట్టుకోని కథనంతో సాగె మూవీ

Published on Dec 16, 2023 12:00 AM IST
Pindam Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: ఆశ్లేషా ఠాకూర్, నిహాల్ కోధాటి, వినోద్ కుమార్, మంజు భార్గవి తదితరులు.

దర్శకుడు : శేషు పెద్దిరెడ్డి

నిర్మాత: డాక్టర్ ఇర్రింకి సురేష్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: రమేష్ ఆర్

ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

పీరియాడిక్ సోషల్ డ్రామా మూవీ శాంతల తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. జవాన్, ఫ్యామిలీ మ్యాన్ మూవీస్ ఫేమ్ ఆశ్లేషా ఠాకూర్ నటించిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష చూద్దాం.

 

కథ :

కర్ణాటకలోని హళేబీడులోని ఒక కుగ్రామంలో, జమీందార్ అయిన (వినోద్ కుమార్) యువతుల పట్ల అనుచితమైన ఉద్దేశాలను కలిగి ఉంటాడు. శాంతల (ఆశ్లేషా ఠాకూర్), నృత్యం పట్ల మక్కువ కలిగి ఉంటుంది, అలానే రాజశేఖర్ (నిహాల్ కోధాటి)తో ప్రేమలో ఉంటుంది. అయితే ఆ తరువాత శాంతల వినోద్ నుండి ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ఆపై ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తన కలను ఎలా సాధిస్తుంది అనేది మనం సినిమాలో చూడవలసిన మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా చెప్పుకోవలసింది మూవీలో కీలక పాత్ర చేసిన ఆశ్లేషా ఠాకూర్ మంచి పెర్ఫార్మన్స్ కనబరిచారు. కేవలం అందాన్ని మాత్రమే కాకుండా భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించారు. ఆమెకు ఈ పాత్ర నటిగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. నిహాల్ కోధాటి, చిన్న పాత్ర కలిగి ఉన్నప్పటికీ, తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకునే నటనను కనబరిచారు. ఇక ప్రముఖ నటి మంజు భార్గవి కొద్దిసేపు అతిధి పాత్రలో మెరిసారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది మరియు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి.

 

మైనస్ పాయింట్స్ :

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడైన శేషు పెద్దిరెడ్డి తన తొలి చిత్రానికి మంచి కథను రాసుకున్నప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను అందించడంలో కొంత విఫలం అయ్యారు. చారిత్రక అంశం పక్కన పెడితే, మిగిలిన కథనంలో జోరు లేదు, ఇక కథనం మొదటి గంటలోనే సులభంగా ఊహింపబడుతుంది. అలానే పేలవమైన స్క్రీన్‌ప్లే కథ యొక్క ఫ్లోను అడ్డుకుంటుంది మరియు చాలా సన్నివేశాలు ప్రభావం చూపవు. మూవీలోని చాలా మంది నటీనటులు సాధారణ ప్రేక్షకులకు పరిచయం లేదు, మరియు వినోద్ కుమార్ జమీందార్ పాత్ర కృత్రిమంగా, అనుకోకుండా హాస్యాన్ని సృష్టించేలా కనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

శేషు పెద్దిరెడ్డి చరిత్రను సూటిగా చెప్పడానికి ప్రయత్నించారు కానీ మరింత ప్రభావవంతమైన స్క్రీన్‌ప్లే మరియు క్యారెక్టర్ ప్రదర్శనని చూపించలేకపోయారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ అత్యద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లతో సినిమాలో బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి. రెండు భాగాలలోని కొన్ని సీన్స్ లో ఎడిటింగ్ విభాగం మరింతగా పనిచేస్తే బాగుండేది.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే శాంతల ఒక పీరియాడికల్ సోషల్ డ్రామాగా సాగుతూ పర్వాలేదనిపించేలా అనిపిస్తుంది. ఆశ్లేషా ఠాకూర్ యొక్క అద్భుతమైన నటన మరియు ఆకట్టుకునే సంగీతం దీనికి బలాలు అని చెప్పాలి. అయితే పేలవమైన స్క్రీన్‌ప్లే, ఊహాజనిత కథాంశాలు మరియు తెలియని తారాగణం ఇందులో లోపాలు. ఓవరాల్ గా ఈ వారాంతంలో దీనికి బదులు ప్రత్యామ్నాయంగా వేరొకటి చూసుకోవచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు