విడుదల తేదీ: మార్చి 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: చైతన్య రావు, భూమి శెట్టి, నంద కిషోర్, వెంకీ మంకీ, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, తదితరులు
దర్శకుడు: కుమార స్వామి
నిర్మాత: శ్రీలత – నాగార్జున్ సామల, శారద – శ్రీష్ కుమార్ గుండ, విజయ – డా. కృష్ణకాంత్ చిత్తజల్లు
సంగీత దర్శకుడు: అరుణ్ చిలువేరు
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
ఎడిటింగ్: Ch. వంశీకృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సంబంధిత లింక్స్: ట్రైలర్
షరతులు వర్తిస్తాయి (Sharathulu Varthisthai) అనే చిన్న బడ్జెట్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
చిరంజీవి (చైతన్య రావు) ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లో పనిచేస్తాడు. అతను తన అవసరాలను తీర్చడానికి చాలా కష్టపడతాడు. చిరంజీవి తన తల్లిని, ఇద్దరు తోబుట్టువులను చూసుకోవాలి. తన చిన్నప్పటి నుండి తన సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్న విజయశాంతి (భూమి శెట్టి)తో లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో ఉంటాడు. ఆర్థిక మోసం అతని జీవితాన్ని కలవరపెడుతుంది. ఇది ఏమిటి? దాన్ని చిరంజీవి ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
చైతన్యరావు మిడిల్ క్లాస్ వ్యక్తిగా చాలా బాగా నటించాడు. అతను చిరంజీవి పాత్రలో జీవించాడు అని చెప్పాలి. ఆయన డైలాగులు మిడిల్ క్లాస్ కుటుంబాలను ఆకట్టుకునేలా ఉంటాయి. మెజారిటీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్న కాన్సెప్ట్‌ని చైతన్యరావు సెలెక్ట్ చేసుకోవడం విశేషం.
భూమి శెట్టికి ఒక ముఖ్యమైన పాత్ర లభించింది. నటి సహజమైన, చక్కని నటనను ప్రదర్శించింది. ప్రధాన నటీనటులు నటించిన కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
అత్యధిక జనాభా కలిగిన మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తెరకెక్కింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు బలి అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ చిత్రం చూసే ఆడియెన్స్ కి అలాంటి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఉద్దేశ్యం మెచ్చుకోదగినది అయినప్పటికీ, ప్రెజెంటేషన్ అంత డీటెయిల్డ్ గా లేదు.
చాలా సన్నివేశాలు డల్‌గా ఉన్నాయి, కథనం స్లో గా సాగుతుంది. ఎమోషనల్ మూమెంట్స్‌తో సినిమా చాలా సన్నివేశాల్లో అతి అనిపిస్తుంది. దీని వలన కొన్ని సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాలు కన్విన్సింగ్‌గా అనిపించవు. కొన్ని సందర్భాల్లో బోధించడం కొంచెం ఎక్కువగా ఉంది, ఇది ఆడియన్స్ కి చికాకును కూడా కలిగిస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని చూడదగిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ సెకండాఫ్ చాలా బోరింగ్‌గా, ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. అంతేకాక కొన్ని సన్నివేశాలు ముందే ఊహించే విధంగా ఉండటం, సినిమా అనవసరంగా పొడిగించినట్లు ఉంది. పైగా ఎలక్షన్ యాంగిల్ కథకు సెట్ అవ్వలేదు.
సాంకేతిక విభాగం:
అరుణ్ చిలువేరు అందించిన సంగీతం పర్వాలేదు. ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రఫీ నీట్ గా, నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బాగోలేదు, ఎందుకంటే సినిమాకు కాస్త ట్రిమ్మింగ్ అవసరం.
ఆర్థిక మోసాల గురించి అవగాహన కల్పించాలనే దర్శకుడు కుమార స్వామి ఉద్దేశం మంచిదే, కానీ సరిగ్గా ప్రెజెంట్ చేయలేక పోయాడు. సినిమాలో బలమైన సందేశం ఉంటే సరిపోదు, అది ఆకర్షణీయంగా ఉండాలి. చాలా బోరింగ్ గా, డల్ గా సాగే సన్నివేశాలు సినిమా ఫలితం పై ప్రభావం చూపాయి.
తీర్పు:
మొత్తానికి షరతులు వర్తిస్తాయి (Sharathulu Varthisthai) మిడిల్ క్లాస్ ప్రజలను ఉద్దేశించి తీసిన సినిమా. అయితే ట్రీట్మెంట్ చాలా వరకు బోర్ కొట్టిస్తుంది. ఈ చిత్రంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్‌ల గురించి చెప్పడం జరిగింది. ఈ పాయింట్ బాగానే అనిపించినా, స్క్రీన్ ప్లేలో మన దృష్టిని ఆకర్షించే అంశాలు లేవు. చైతన్యరావు, భూమి శెట్టి తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఆకట్టుకొనే సన్నివేశాలు ఉన్నాయి. కానీ సెకండాఫ్ మాత్రం విసుగు పుట్టించే సన్నివేశాలతో ఉంది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team