‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు?

‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు?

Published on Apr 3, 2015 3:30 PM IST

Sharrath-Marar
పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి దాదాపుగా రెండు నెలలు దాటింది. ఇక పూర్తి స్థాయి హీరోగా చేసిన చిత్రం విడుదలై దాదాపుగా సంవత్సరం పైనే అయిపోయింది. 2013లో అత్తారింటికి దారేది చిత్రం ద్వారా చివరగా మన ముందుకు వచ్చిన పవన్, మధ్యలో ఒక అతిథి పాత్రలో ‘గోపాల గోపాల’ సినిమాలో నటించాడు. కాగా ఆయన ఇప్పటివరకూ వేరొక సినిమా షూటింగ్‌ మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్’‌కు సీక్వెల్‌గా గబ్బర్ సింగ్ 2ను అనౌన్స్ చేసినా ఆ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదు.

’గబ్బర్ సింగ్ 2’ సెట్స్‌పైకి వెళ్ళడం అటుంచితే.. ఈ ప్రాజెక్టుకు దర్శకులు మాత్రం మారుతూ వస్తుండడం విశేషం. చివరకు ‘పవర్’ సినిమా ద్వారా హిట్‌ కొట్టిన బాబీని దర్శకుడిగా ఫైనల్ చేశారు. ఈమధ్య కాలంలో ఇన్ని మార్పులకు గురైన సినిమా బహుశా ఇదే కావొచ్చు! ఒకానొక దశలో గబ్బర్ సింగ్ ఆగిపోయిందనే పుకార్లు కూడా వినిపించాయి. అయితే.. తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న శరత్ మరార్ సినిమా ప్రోగ్రెస్‌పై సమాచారమిచ్చారు. ఇప్పటికే దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు