ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ గా శర్వా ?

Published on Apr 14, 2021 1:13 am IST

హీరో శర్వానంద్ ది మొదటి నుండి విభిన్నమైన శైలి. ఏది చేసినా కొత్తగా ఉండాలనుకుంటాడు. అందుకే, ఈ జనరేషన్ లో శర్వా వేసినన్నీ వైవిధ్యమైన పాత్రలు మరో ఏ హీరో చేయలేదు. అయితే ఈ హీరో మరోసారి ఖాకీ చొక్కా వేసుకోబోతున్నాడు. ఇప్పటికే “రాథ” అనే సినిమాలో కామెడీ కాప్ గా కనిపించి అలరించాడు. ఈ సారి మాత్రం ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ క్యారెక్టర్ వేయబోతున్నాడట.

కాగా ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ శర్వాకు చాల బాగా నచ్చిందట. సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుందని.. పోలీస్ స్టోరీ అయినప్పటికీ చాలా కొత్తగా ఉంటుందని.. తన కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదట. మరి శర్వానంద్ లాంటి భిన్నమైన హీరోకి కథ బాగా నచ్చింది అంటే.. మరి ఆ కథ ఏ రేంజ్ లో ఉందో చూడాలి. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి.

సంబంధిత సమాచారం :