బాలయ్య టైటిల్‌తో వస్తున్న శర్వానంద్

బాలయ్య టైటిల్‌తో వస్తున్న శర్వానంద్

Published on Jan 15, 2025 12:01 AM IST

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్‌తో సాగుతోంది. ఈ సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను సంక్రాంతి కానుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘నారీ నారీ నడుమ మురారి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అందాల భామలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గతంలో బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను ఇప్పుడు శర్వా సినిమాకు వాడటంతో ఈ మూవీ ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు