శర్వానంద్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు..మరి ఫలితం ?

Published on Oct 27, 2020 1:08 am IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మంచి హిట్ అందుకుని చాలా కాలమైంది. చివరగా ‘మహానుభావుడు’ చిత్రంతో మెప్పించిన ఆయన ఆతర్వాత చేసిన సినిమాలతో పెద్దగా అలరించలేకపోయారు. ముఖ్యంగా ఆయన్ను ఎక్కువగా అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ‘పడి పడి లేచే మనసు, రణరంగం, జాను’ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మూడు చిత్రాలు వేటికవే డిఫరెంట్ జానర్ చిత్రాలే అయినా ఒక్కటీ క్లిక్ అవ్వలేదు. అందుకే శర్వా మరోసారి కుటుంబ కథా చిత్రాలపైనా, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ల మీద దృష్టి పెట్టారు.

ప్రజెంట్ ఆయన కిషోర్ బి దర్శకత్వంలో ‘శ్రీకారం’ సినిమా చేస్తున్నారు. ఇది ‘శతమానంభవతి’ తరహాలోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్. దీంతో పాటే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ఒకటి చేస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ చేయనున్నారు. ఈ రెండూ కూడ యువ ప్రేక్షకులను టార్గెట్ చేసిన చిత్రాలు. ఇవి కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రం చేయనున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రం లాంఛ్ అయింది. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. ఇది కంప్లీట్ ఫన్ ఎంటెర్టైనర్. ఇలా నాలుగు సినిమాలతో అటు యువతను, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేశారు శర్వా. మరి ఆయన చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More