కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం తో తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు శత్రు. ఆ చిత్రంలో హీరోయిన్ అన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఆ సినిమా తరువాత కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించిన ఇటీవల రంగస్థలం , భరత్ అనే నేను చిత్రాల్లో నటించి ఇప్పుడు వరుస అవకాశాలను సంపాదిస్తున్నాడు.
దాంట్లో భాగంగా తమిళ భాషలో కార్తీ నటించిన’కడై కుట్టి సింగం’ చిత్రంలో శత్రు ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘చినబాబు’ గా రేపు విడుదలవుతుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కార్తీతో సమానమైన ప్రాధాన్యం ఉన్నపాత్రలో నటించాడట శత్రు. చినబాబు తన కెరీర్ కు ఒకేసారి రెండు భాషల్లో బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు శత్రు. ఇక ఈ చిత్రం కనుక విజయం సాధిస్తే తెలుగు , తమిళ భాషల్లో ఆయనకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం గా కనిపిస్తుంది.