బాలయ్య 109, 110 లో కూడా ఆమెనే.?

బాలయ్య 109, 110 లో కూడా ఆమెనే.?

Published on Jul 20, 2024 11:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కాస్ట్ కూడా ఉన్నట్టుగా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ గ్లామరస్ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) అలాగే బాబీ డియోల్ లు ఈ చిత్రంలో నటిస్తుండగా అసలు ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు.

అయితే కొన్ని నెలలు కితమే యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఉన్నట్టుగా చిన్న బజ్ వచ్చింది. ఇది అధికారంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రగ్య జైస్వాల్ ఇప్పుడు బాలయ్య 109 లోనే కాకుండా నెక్స్ట్ 110 వ సినిమాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

బాలయ్య 110 ఇప్పుడు వరకు తాను వర్క్ చేయని దర్శకునితో ఉంటుందో లేదా బోయపాటి శ్రీనుతో ఉంటుందో అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎలాగో అఖండ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా కనిపించింది కాబట్టి ఒకవేళ బాలయ్య 110 అఖండ 2 (Akhanda 2) అయితే ప్రగ్య జైస్వాల్ కనిపించే ఛాన్స్ ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు