ఆమె సూపర్ స్టార్ అవుతుంది – విజయ్ దేవరకొండ

Published on Nov 22, 2020 4:00 pm IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో తన తరువాత సినిమాని క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తోన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య గురించి మాట్లాడుతూ.. తను చాలా డౌన్ టు ఎర్త్ అని.. అలాగే అనన్య సూపర్ టాలెంట్ అమ్మాయి అని.. రాబోయే రోజుల్లో అనన్య సూపర్ స్టార్ అవుతుంది అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

కాగా అనన్య కూడా గతంలో హీరో విజయ్ దేవరకొండ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. అనన్య మాట్లాడుతూ.. ‘విజయ్ చాల స్మార్ట్ అండ్ కైండ్.. అందరితో బాగా మాట్లాడతాడు, ముఖ్యంగా తనకు సంభాషణను ఎలా కొనసాగించాలో బాగా తెలుసు, తనతో కలిసి వర్క్ చేయడం చాల హ్యాపీగా ఉందని’ తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More