షేర్షా దర్శకుడు మెగా హీరోను పట్టుకోబోతున్నాడా?

Published on Sep 15, 2021 2:18 am IST


ఓటీటీల్లో ఇప్పటివరకు విడుదలై అతిపెద్ద విజయాలు సాధించిన సినిమాల్లో “షేర్షా” కూడా ఒకటి. ఈ సినిమాకు ఇంతలా ఆదరణ రావడానికి కర్త, కర్మ, క్రియ అంతా దర్శకుడు విష్ణువర్ధన్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఈ దర్శకుడు మెగా హీరో వైపు చూస్తున్నాడని తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్‌తో పంజా సినిమాను చేశాడు విష్ణు వర్ధన్.

అయితే ఓ క్రేజీ స్క్రిప్ట్‌తో ఇప్పుడు విష్ణువర్ధన్ మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను సంప్రదించాడన్న వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హిందీలో చాలా సినిమాల ఆఫర్లు వస్తున్నా, కొత్తగా వచ్చిన వైష్ణవ్‌ను నిజంగానే ఎంచుకుని విష్ణువర్ధన్ సినిమా చేయబోతున్నాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :