‘పెద్ది’ స్క్రిప్ట్‌పై శివన్న వైరల్ కామెంట్స్

‘పెద్ది’ స్క్రిప్ట్‌పై శివన్న వైరల్ కామెంట్స్

Published on Apr 16, 2025 3:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్ర, స్క్రిప్టుపై ఆయన తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని.. తనకు ఈ స్క్రిప్ట్ చాలా నచ్చిందని.. తన పాత్ర చాలా స్పెషల్‌గా ఉండబోతుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం పెద్ది మూవీపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు