నిన్నుకోరి తో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ. ఈచిత్రం తరువాత నాగ చైతన్య తో మజిలీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈసినిమా కూడా సూపర్ హిట్ కానుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక శివ ఈ సినిమా ను హ్యాండిల్ చేసిన తీరు ఆ నిర్మాతలకి బాగా నచ్చడంతో తమ తదుపరి చిత్రాన్ని కూడా శివ తో చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం శివ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
అయితే శివ ఈ సారి స్టార్ హీరోలకోసం ఎదురుచూస్తున్నాడు. స్టార్ హీరో ను ఒప్పించే బాధ్యత కూడా నిర్మాతలపైనే పెట్టాడట. మరి రెండవ సారి ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.